సీనియర్ నటుడు,కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ ప్రస్థానంలో 183 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పట్లో జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మొదట చిలకా గోరింక సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అరంగ్రేటం చేశారు. ఆ తర్వాత మూడు సార్లు నంది అవార్డులు ఐదు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు కృష్ణంరాజు. ఒకవైపు వెండితెరపై నటుడిగా అలరిస్తూనే మరొకవైపు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సేవలను అందించారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కృష్ణంరాజు తన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి చేత కేక్ కటింగ్ చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పని మనిషి ఏంటి కేక్ కటింగ్ చేయించడమేంటి అని అనుకుంటున్నారా! రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు, కుటుంబం ఆమెను ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె కేక్ కట్ చేయించారు. సంబంధించిన ఫోటోలు కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు థాంక్యూ పద్మా ఆంటీ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆమెకు ఒక బంగారు గొలుసులు కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…