Krithi Shetty: నితిన్,కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన ముందుగా నటించే అవకాశం కృతి శెట్టికి కాకుండా నేషనల్ క్రష్ రష్మికకు అవకాశం వచ్చింది.అయితే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఆమె స్థానంలో కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తుంది.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో నితిన్ రష్మిక ఇద్దరు జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా చేయాలని భావించారు.అయితే భీష్మ సినిమా షూటింగ్ సమయంలో నితిన్ రష్మిక మధ్య ఏదో మనస్పర్ధలు తలెత్తాయని ఆ కారణం చేత రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వస్తున్నాయి.
ఇకపోతే రష్మిక ఈ సినిమాని రిజెక్ట్ చేయడానికి మరో కారణం కూడా తెలుస్తోంది. రష్మిక అప్పటికే పలు సినిమాలకు కమిట్ కావడం వల్ల తనకు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రష్మిక మాత్రం ఈ సినిమాని వదులుకుంటేనే కృతి శెట్టి అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…