Krithi Shetty: లిప్ లాక్ సీన్లలో నటించడానికి అభ్యంతరం లేదు..! కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు మనసులను కొల్లగొట్టింది కృతి శెట్టి. బేబమ్మగా తొలి సినిమాలోనే తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా చాలా పరిణితితో నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో కృతి శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయ.
ఓవైపు అందం మరోవైపు అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండటంతో నిర్మాతలు, డైరెక్టర్లకు బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ నాని శ్యాం సింగ రాయ్ లో నటించింది. ఈ సినిమాలో కూడా మోడ్రన్ అమ్మాయిగా కీర్తి పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా.. బంగార్రాజులో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నానితో లిప్ లాక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది కృతి శెట్టి. అయితే బోల్డ్ సీన్లు చేస్తే అంతా బ్యాడ్ అనుకుంటారు. అయితే ఏం చేసినా వృత్తి పరంగానే మేం చేస్తాం అని కృతి శెట్టి అన్నారు.
అన్ని సీన్లలో నటించినట్లే ఈ సీన్లలో కూడా నటిస్తామని ఆమె వెల్లడించింది. కథలో లిప్ లాక్ సీన్లు అవసరం అనిపిస్తే చేస్తాను. లేకపోతే చేయను అని స్పష్టం చేసింది. శ్యాం సింగ రాయ్ సినిమా అవసరం ఉంది కాబట్టే ఆసీన్లలో నటించానని అంటుంది బేబమ్మ. తొలి సినిమా ఉప్పెనలో కూడా వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ సీన్లలో అదరగొట్టింది కృతి శెట్టి. ఇక బంగార్రాజు సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో మంచి ఊపు మీదున్న బేబమ్మకు రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…