Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!
Sad News: ప్రస్తుతం ఉన్న జీవవ విధానంతో చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. మాతృత్వ మాధుర్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐవీఎఫ్, సరోగసీ చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు.
కావాలని నవజాత శిశువును ముళ్ల పొదల్లో, చెత్త కుండీల్లో వదిలి వెళుతున్నారు. ఎవరైనా చూస్తే బతికి బయటపడుతున్నారు. లేకపోతే.. మరణిస్తున్నారు. చిన్న పిల్లల్ని అన్ని ఉన్నా అనాథలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలియక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి చాలా ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం.
యుక్తవయసులో తప్పటడుగులు వేసి అబార్షన్లు చేయించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. బయటకు తెలిస్తే సమాజం అవమానిస్తుందని గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకుంటున్నారు. బిడ్డలు పుడితే ఎక్కడో చోట విసిరేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. అయితే పూర్తిగా నెలలు నిండక ముందే శిశువును గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందే.. శిశువును ఖననం చేశారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన శిశువు మరణిస్తే ఖననం చేశారని.. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…