Featured

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

భాషా, ముత్తు, అరుణాచలం చిత్రాల అనంతరం మరొక సూపర్ హిట్ చిత్రంలో రజినీకాంత్ నటించాలనుకున్నారు. ఆ క్రమంలో.. దర్శకుడిగా కె ఎస్ రవికుమార్ అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారు. కథ ఎలాంటిదయితే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూచిస్తూ.. జీవితంలో ‌ పంతాలకు, పట్టింపులకు పోయే మొండి పట్టుదలతో ఒక కథానాయిక కథ తయారు చేయమని రజినీకాంత్ దర్శకుడు రవికుమార్ తో చెప్పారు.

ఆ క్రమంలో పుట్టుకొచ్చినదే “నరసింహ” చిత్రం కథ. నరసింహ సినిమా చిత్రీకరణకు ముందు దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చిరంజీవి తో తెలుగులో “స్నేహం కోసం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పొగరు, మొండి పట్టుదల గల ఈ పాత్రకు(నరసింహ-నీలాంబరి) హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకునే క్రమంలో.. హీరోయిన్స్ నగ్మా, మీనా పేర్లు తెరపైకి వచ్చాయి. స్నేహంకోసం చిత్రంలో చిరంజీవితో జోడిగా మీనా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సందర్భంలో ఒక సీన్ లో మీనా అగ్రెసివ్ లుక్ ఇవ్వాలి. ఆ సీన్ లో మీనా బాగా నటిస్తున్నారు కానీ అగ్రెసివ్ లుక్ ఆమె ఫేస్ లో రావడంలేదని దర్శకుడు కె.ఎస్ రవికుమార్ అనుకున్నారు.

తిరిగి చెన్నైలో రజనీకాంత్ ఆరగెంట్ క్యారెక్టర్(పొగరుబోతు నీలాంబరి పాత్ర)కి మీనా ను అనుకున్నాం కదా ఏమయిందని కె.ఎస్.రవికుమార్ అని అడగగా.. స్నేహం కోసం సినిమా షూటింగ్ లో ఓ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎందుకో మీనా పొగరుగా కనిపించడం లేదని దర్శకుడు రవికుమార్ రజనీకాంత్ తో అన్నారు. అయితే ఆ పొగరుబోతు పాత్రకి ఎవరైతే బాగుంటుందో మీరే ఆలోచించండని రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ తో అన్నారు. ముందుగా ప్రముఖ నటి నగ్మా ను ఆ పాత్రకి ఎంపిక చేయాలనుకున్నప్పటికీ.. ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే కె ఎస్ రవికుమార్, రమ్యకృష్ణతో అంతవరకు ఒక్క సినిమా కూడా రూపొందించలేదు. కానీ ఆమెతో కె.ఎస్.రవికుమార్ కి పరిచయం ఉంది. ఆ విధంగా “నరసింహా” చిత్రంలోని నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు.

నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర అవుట్ అండ్ అవుట్ ఆరగెంట్ క్యారెక్టర్. రజినీకాంత్ తో ఇలాంటి రోల్ చేయడానికి ముందుగా రమ్యకృష్ణ ఆలోచించి నప్పటికీ ఆ పాత్రను సవాల్ గా తీసుకుని ఆ చిత్రంలో నటించాలనుకున్నారు. సింపుల్ గా స్టోరీ అవుట్ లైన్..
నరసింహ (రజనీకాంత్) ఒక జమీందారు (శివాజీ గణేశన్) కొడుకు. పట్నంలో చదువుకుని ఊరికి వస్తాడు. తన మేనమామ కూతురైన నీలాంబరి (రమ్యకృష్ణ) గర్విష్టి. ఆమె నరసింహను పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కానీ నరసింహకు మాత్రం ఆమె ప్రవర్తన నచ్చదు. నీలాంబరి ఇంట్లో పనిచేసే వసుంధర (సౌందర్య) ను ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో నరసింహాను పగబట్టిన నీలాంబరి, నరసింహా ప్రేమించే వసుంధరపై తీవ్రమైన ఆవేశంతో ఉంటుంది.

అయితే నరసింహ సినిమా షూటింగ్ సమయంలో… రమ్యకృష్ణ కోపంతో సౌందర్య ముఖంపై తన కాలి పాదంతో… ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి?. నీ పరిస్థితి ఏమిటి..? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు.. కానీ నేను తలుచుకుంటే చంద్రమండలంలో తినగలను అంటూ… రమ్యకృష్ణ, సౌందర్య చెంపపై తన కాలితో అటు.. ఇటు అనే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ముందుగా రామకృష్ణకు చెప్పడంతో… సౌందర్యను అలా కాలుతో అనడం ఇబ్బందిగా ఫీల్ అయింది. కానీ దర్శకుడు ఒత్తిడి చేయడంతో అలా నేను చేయనని ఏడ్చింది.

చివరికి సౌందర్య, దర్శక నిర్మాతలు చెప్పడంతో ఆ సన్నివేశాన్ని చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకున్నారు. నీలాంబరి పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో అద్భుత విజయాన్ని సాధించిన “బాహుబలి” చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్ర రావడానికి నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్ర అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నరసింహ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్ బాగా వచ్చిందని ఆనాటి నరసింహ సినిమా ‌షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చెప్పుకొచ్చారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago