Movie News

విజయ్ దేవకొండ కింగ్‏డమ్ సినిమాకి రివ్యూ ఇచ్చిన కేటీఆర్ కొడుకు.. విజయ్ రిప్లై వైరల్..

హైదరాబాద్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం అయింది. ఉదయం నుంచే పాజిటివ్ రివ్యూస్ రావడం తోపాటు, విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలం తర్వాత విజయ్‌కు ఇది సాలిడ్ కంబ్యాక్ అని అభిమానులు భావిస్తున్నారు.

KTR’s son reviews Vijay Devekonda’s movie Kingdom.. Vijay’s reply goes viral..

హిమాన్షు కొనియాడిన ‘కింగ్‌డమ్’

ఈ సినిమా చూసిన సెలబ్రిటీలలో కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా ఉన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. “RTC X రోడ్స్‌లో నా ఇద్దరు స్నేహితులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. థియేటర్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం, బిగ్ స్క్రీన్ అనుభవం, ప్రేక్షకుల ఎనర్జీ అన్నీ కలిపి అద్భుతంగా అనిపించాయి. కింగ్‌డమ్ వైబ్ గూస్ బంప్స్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అద్భుతం. ఈ సినిమా నాకు చాలా నచ్చింది” అని హిమాన్షు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ హార్ట్ ఎమోజీలతో స్పందించారు.

విజయ్ దేవరకొండ ఆనందం

అంతేకాకుండా, విజయ్ దేవరకొండ కూడా సినిమా రెస్పాన్స్‌పై ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. “ప్రస్తుతం నాకు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోవాలని ఉంది. మీరు నాతో ఇలా అనుభూతి చెందాలని ఎప్పటినుంచో కోరుకున్నాను. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ప్రేమ… నా లాంటి వాడికి ఇంకా ఏం కావాలి!” అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కింగ్‌డమ్’కు వస్తున్న పాజిటివ్ స్పందన విజయ్ దేవరకొండ కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago