L.B. Sriram : ఆమ్మో ఒకటో తారీఖు సినిమా హిట్ కాకపోడానికి కారణం అదే… ఈవివి దగ్గర ఇరుక్కుపోయాను…: ఎల్బి శ్రీరామ్

L.B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యనటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్నమైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఇక ఆయన సినిమా జర్నీ గురించి మాట్లాడారు.

ఆ సినిమా అందుకే ఫ్లాప్ అయింది…

ఎల్బి శ్రీరామ్ గారు తన సినిమా కెరీర్ లో కమెడియన్ గా ఒక డిఫరెంట్ స్టైల్ మైంటైన్ చేస్తూ అలరించారు. చాలా బాగుంది సినిమాతో మొదలయిన ఆ ట్రెండ్ చాలా సినిమాల్లో కంటిన్యూ అయింది. అయితే ఆయన ఒక్కో సినిమాకు ఒక్కోలాగా డిఫరెంట్ గా చేయాలని అనుకున్నా అది జరగలేదు. ఇక ఈవివి గారి సినిమాల్లో వరుసగా ఆయన ఆదే స్టైల్ మైంటైన్ చేసారు.

నటుడుగా ఎన్నో ప్రయోగాలు చేయాలనుకున్న ఆయన ఈవివి గారి వద్దే ఇరుక్కుపోయారట. ఇక ఆయన కెరీర్ లోనే గొప్ప సినిమా ఆమ్మో ఒకటో తారీఖు. ఆ సినిమా చాలా బాగున్నా హిట్ కాకపోడానికి తనను కమెడియన్ గా చూసిన జనాలు ఆ క్యారెక్టర్ లో ఒప్పుకోలేకపోవడమే అని ఇప్పటికీ అనుకుంటాను అంటూ శ్రీరామ్ తెలిపారు.