L.B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యానటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్న మైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం ‘కవి సామ్రాట్’ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఒక మూస పాత్రలతో ఇమడలేక చాలా సినిమాలను వదులుకున్న ఆయన ప్రస్తుతం రచయితగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యువతకు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు.
వాళ్ళ తప్పు కాదు నా తప్పు కాదు…
ఎల్బి శ్రీరామ్ గారు రచయితగా హిట్లర్, ఆ ఒక్కటి అడక్కు, కోకిల, హలో బ్రదర్స్ వంటి సినిమాలకు డైలాగులు రాసారు. ఇక సినిమాల్లో కూడా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఆది’ లో నటించారు అలాగే రాజమౌళి ‘ఛత్రపతి’ వంటి సినిమాలోను నటించారు. కానీ ఆ సినిమాలు పెద్ద సక్సెస్ అయినా మళ్ళీ ఆ డైరెక్టర్ల సినిమాల్లో శ్రీరామ్ గారు కనిపించలేదు.
ఇక ఈ విషయం గురించి ఆయన స్పందిస్తూ అది వాళ్ళ తప్పు కాదు నా తప్పు కాదు, అలా జరిగింది అంతే. అలా జరగలేదు, నేను మళ్ళీ సినిమాల్లో చేయలేదు కాబట్టే నాకు నచ్చినట్లు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటున్నాను. నాకు నచ్చిన పాత్ర చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ అనేది విశ్వవ్యాప్తం, అందరూ ఇక్కడ ఏం కావాలో ఆది చూస్తారు అలాంటప్పుడు నాకు ఇంకా మంచి ప్లాట్ ఫామ్ దొరికినట్లే కదా. అయినా సినిమాల్లో కూడా ఇప్పటికీ నటిస్తున్నాను, నాకు నచ్చిన పాత్రలైతే చేస్తున్నాను లేకుంటే లేదు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…