ఎక్కడో ఊర్లనుండి పట్టణానికి ఎంతో మంది యువతులు వస్తుంటారు. కొందరు బ్రతుకుదెరువు కోసం వస్తుంటే, మరి కొందరు పై చదువుల కోసం వస్తుంటారు. అలా వచ్చే యువతులు కొందరు వారి కుటుంబీకుల ఇళ్లలో ఉంటె.. మరి కొందరు లేడీస్ హాస్టళ్లలో ఉంటుంటారు. ఇలాంటి హాస్టళ్లు పట్టణాల్లో పుట్టగొడుల్లా వెలిసాయి. అయితే తాజగా ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ చేసిన నిర్వాకం బట్టబయలు అయింది. హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో లేడీస్ హాస్టల్ లో హాస్టల్ వార్డెన్ యువతులతో మంచిగా ఉంటూనే వారి జీవితాలతో ఆటలాడుకున్నాడు.
లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉంటున్న మదన్ కుమార్ అనే వ్యక్తి అమ్మాయిలు ఉండే గదులలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసాడు. వారి బాత్రూమ్ లలో కూడా ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి యువతులకు తెలియకుండా వారి నగ్న వీడీయోలను రికార్డ్ చేసేవాడు. అంతేకాదు ఆ వీడియోలను సదరు యువతులకు వాట్సాప్ ద్వారా పంపి బ్లాక్ మెయిల్ చేసి అతని కోరిక తీర్చాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించేవాడు. తాజగా ఒక అమ్మాయిని ఇదే తరహాలో బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోడానికి ప్రత్నిచింది. అదే సమయంలో మిగిలిన యువతులు అందరు కాపాడి, విషయం తెలుసుకున్న వారు హాస్టల్ వార్డెన్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ వార్డెన్ మదన్ కుమార్ ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసారు. మదన్ కుమార్ ను తమదైన రీతిలో విచారిస్తున్నారు. త్వరలో అతను చేసిన మరిన్ని అకృత్యాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…