సినిమా ఇండస్ట్రీలో ఎలా బ్రతికాము అనే దానికన్నా ఎంత కాస్ట్ లీగా బ్రతుకుతున్నారు అనే దానికే సెలెబ్రెటీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే వాళ్ళు సంపాదించే దానిలో ఎక్కువ మొత్తం బ్రాండెడ్ బట్టలు, యక్షసరీస్ కే ఖర్చు పెడుతుంటారు. వారు ఉండే ఇల్లు కూడా రిచ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అంతలా వాళ్ల లైఫ్ స్టైల్ కి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇపుడు అయితే వీటన్నిటి కంటే ఎంత కాస్ట్ లీ కారులో తిరుగుతున్నాం అని చూస్తున్నారట, వాటికోసం అప్పు చేసి మరీ కొంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. మొన్న ఈ మధ్యనే యాంకర్ అనసూయ ఆడీ కారు కొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. అలాగే మరో యాంకర్శ్యా మల, మంజుష కూడా బెంజ్ కార్లు కొని మేము ఏమి తక్కువ కాదు అని నిరూపించుకున్నారు. కెరీర్ పరంగా యాంకర్ లకు ఇపుడు డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పొచ్చు. టీవీ షోల దగ్గర నుండి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు కామన్ అయిపోయిన ఈరోజుల్లో యాంకర్లకు ఉన్న డిమాండ్ అంత ఇంతా కాదు..
అయితే తాజాగా ఇపుడు అదే కాస్ట్ లీ కారుల ఖాతాలో మరొక యాంకర్ ఉదయభాను చేరింది. మోస్ట్ సీనియర్ యాంకర్ ఉదయభాను కెరీర్ పరంగా కొంత వెనకబడి ఉన్నా.. నేనేం తక్కువ కాదు అని బెంజ్ కారు కొని అందర్నీ సర్ప్రైజ్ చేసింది. సీనియర్ యాంకర్ అయిన ఉదయభాను అప్పట్లో చాలా షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అయిన తర్వత కూడా కొన్ని ప్రోగ్రామ్ లో కనిపించిన ఇపుడు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఉదయభానుకి ఇద్దరు కవల పిల్లలు పుట్టాక కొంత గాప్ తీసుకొని మళ్లీ యాంకరింగ్ మొదలు పెట్టినా సరైన అవకాశాలు రాక కెరీర్ పరంగా వెనకబడి ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు కొన్న బెంజ్ కారు ఫోటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోవడంతో వార్తల్లోకొచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…