Health News

మధుమేహంతో బాధపడే వారు బెండకాయలు తినవచ్చా…?

సాధారణంగా మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడే వారు కొన్ని రకాల కాయగూరలను తినడం వల్ల వారి శరీరంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయని భావిస్తారు. అయితే మధుమేహ సమస్యతో బాధపడే వారు బెండకాయలను తినవచ్చా? బెండకాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం…

మధుమేహ సమస్యతో బాధపడే వారు నిరభ్యంతరంగా బెండకాయలను తినవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో దాగి ఉన్న ఎన్నో పోషకాలు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో ఉండేటటువంటి ఒలియానోలిక్ ఆమ్లం, బీటా సిస్టోస్టెనాల్, కెంప్ఫెరోల్ సమ్మేళనాలు మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదపడుతుంది.

బెండకాయలను పచ్చిగా లేదా కూరలుచేసి తినడమే కాకుండా బెండకాయల తొక్కను వాటిలో ఉన్నటువంటి గింజలను ఎండబెట్టి ఆహారంలో కలుపుకుని తినడం వల్ల కూడా మన శరీరంలో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. బెండకాయలో పూర్తిగా కరిగే, కరగని ఫైబర్ లో ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర వహిస్తాయి.

బెండకాయలో అధికభాగం ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి కేవలం షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడం కాకుండా ఇతర వ్యాధుల బారి నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి. బెండకాయలో ఉండే మైరిసెటిన్ కేవలం బ్లడ్ షుగర్స్‌ను తగ్గించడమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించడంలో దోహద పడుతుంది.కనుక మధుమేహంతో బాధపడే వారు బెండకాయలను నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

2 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

1 hour ago

“వీక్‌నెస్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చిన దూబే.. ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పవర్ హిట్టర్!”

 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…

1 hour ago