ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అధ్యక్షుడు జాకోబ్ జూమా అరెస్టుకు నిరసనగా ఈ అల్లర్లు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆందోళన జ్వాలలు రగులుతున్నాయి.ఈ సందర్భంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి భవనానికి నిప్పు అంటించడం వల్ల ఆ భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో మహిళ తన ప్రాణాలను రక్షించుకోవడానికి కోసం తన బిడ్డను ఎత్తుకొని కిటికీ నుంచి మొదటి అంతస్తులో గల షాపింగ్ కాంప్లెక్స్ పైకి దూకింది.
ఈ విధంగా దూకిన ఆ మహిళ తన బిడ్డను కిటికీలోనుంచి ఎవరో విసరడంతో తన బిడ్డను క్యాచ్ పట్టుకుంది. ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ పైనుంచి తన బిడ్డను రోడ్డు పైకి విసిరే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి జనం పరుగున వచ్చి ఆ చిన్నారి కిందపడకుండా పట్టుకున్నారు. ఈ క్రమంలో బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు.
ఆ తరువాత మహిళ భవనం పై నుంచి దిగి వచ్చి తన కూతురిని ఎత్తుకొని హత్తుకుంది. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంత సాహసానికి దిగిన మహిళ పేరు మన్యోని . బిడ్డను కిందికి విసరడంతో గాల్లో తేలాడుతున్న చిన్నారిని పట్టుకోవడానికి కింద నుంచి జనాలు చేతులు చాచిన ఫోటోను బీబీసీ కెమేరా మ్యాన్ తుతుకా జోండి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…