ఎక్కడి నుంచో ఒక మహిళ అరుపులు వినిపిస్తున్నాయి. అయితే అవి సంతోషంతోనో..కోపంతోనో.. అరిచే అరుపు కాదు ఎంతో బాధతో రక్షించండి.. అనే అరుపులు వినిపించడంతో అక్కడే పని చేస్తున్నటువంటి వర్కర్లు ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెతకడం మొదలు పెట్టారు. అదే విధంగా ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు కూడా ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెతికారు. చివరికి ఆ అరుపులు రెండు భవనాల మధ్య ఇరుక్కుపోయిన ఓ మహిళ అరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాలిఫోర్నియాలోని శాంతా అనాలో హార్బర్ బౌలేవార్డ్‌లో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మహిళ అరుపులు వినిపించసాగాయి. షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న వర్కర్లు ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెతికారు. ఈ క్రమంలో ని కేవలం 8 ఇంచుల గ్యాప్ ఉన్నటువంటి 2 భవనాల మధ్యలో ఓ మహిళ నగ్నంగా పడి ఉండి రక్షించమని అరవడం గుర్తించారు.
అయితే ఆ మహిళ అంత చిన్న సందులోకి ఎలా వెళ్ళింది అనేది మిస్టరీగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మహిళకు ఆక్సిజన్ అందే విధంగా ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా పోలీసులు ఆమెకు ధైర్యం చెబుతూ అక్కడి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు.
రెండు భవనాల మధ్య కేవలం 8 ఇంచుల మాత్రమే ఉండటంతో ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీయడం ఎంతో కష్టంగా మారింది. దీంతో అధికారులు భవనానికి రంధ్రం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు రెండు భవనాల మధ్య ఇరుక్కున్న ఆ మహిళను సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయానికి బయటకు తీశారు. అయితే ఈ విధంగా నగ్నంగా తలక్రిందులుగా మహిళ అక్కడ పడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…