సాధారణంగా మద్యం షాపుల ముందు మనుషులు మద్యం కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకంగా లిక్కర్ షాప్ లోకి వెళ్లి మద్యం సీసా తీసుకుని మద్యం తాగిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని మండ్లా జిల్లాలో ఒక కోతి లిక్కర్ షాపులోకి వెళ్లి మందు సీసాను తీసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కోతికి ఇతర ఆహారపదార్థాలను ఇచ్చి మద్యం బాటిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కోతి మాత్రం మద్యం సీసా వదిలిపెట్టలేదు. కాళ్లతో సీసా పట్టుకొని నోటి సహాయంతో సీసా సీల్ తీసి నోటి ద్వారా మూత తీసింది.
మద్యం షాపు దగ్గర ఉన్న కొందరు ఈ కోతి చేస్తున్నటువంటి పనిని తమ సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. నోటి సహాయంతో మూత తీసిన కోతి మనుషుల మాదిరిగానే మద్యం తాగింది. ప్రస్తుతం కోతి మద్యం తాగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొంతమంది స్థానికులు మాత్రం ఈ కోతి తరచూ షాపు వద్దకు వస్తుందని, అక్కడ తాగి పడేసిన మద్యం బాటిళ్లను తాగడం స్థానికులు చూశారని, ఆ కోతి మద్యానికి అలవాటు పడటం వల్లే తరచు ఇక్కడికి వస్తుందని తెలిపారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు పూర్వజనలో మందు బాబు ఈ జన్మలో ఇలా పుట్టి ఉంటాడు అందుకే మందు పిచ్చి ఎక్కువగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…