లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవించాలంటే ఏం చెయ్యాలి.? డబ్బు ఎప్పుడు మీ వద్ద ఉండాలంటే మీ ఇంట్లో ఆటంకాలు పరిచే కొన్ని వస్తువులను, కొన్ని అలవాట్లను మార్చాలి. మనం నివశించే ఇంటి విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానివలన మన జీవితం ఎంతో ఆనందంగా, సిరిసంపదలతో ఉంటుంది. ఫలితంగా లక్ష్మీ దేవి ఎప్పుడు మీ వద్ద ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సకల దేవుళ్లలో ముందుగా ప్రార్థించాల్సింది వినాయకుడికి. కాబట్టి గణపతిని ఎప్పటికి మరువకూడదు. పూజ మందిరంలో ఉన్న గణేశునికి రోజూ భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించాలి. కాని కొన్ని ఇళ్లల్లో చాలా రోజుల పాటు పూజ మందిరానికి అలంకరించిన పూలు, పూజలో వాడిన పుష్పాలను అలాగే ఉంచేస్తారు. ఈ పద్ధతి సరికాదు. వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి. వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి.
మనం నివశించే ఇంటి సింహ ద్వారం, మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీనిబట్టి మనకు అనుకూలమైన విధంగా ఉండాలి. అలా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీనిబట్టి మనకి నప్పని సింహాద్వారంలో ఉండటం వలన ఆర్ధికంగా, ఆరోగ్యంగా కొన్ని సమస్యలు వస్తాయి. సింహ ద్వారానికి అటు ఇటు కిటికీలు ఉండాలి. లేదంటే కనీసం ఒక వైపైనా కిటికీ ఉండాలి. ఇలా ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది.
చాలా మంది ఇంట్లో వాటర్ ట్యాప్ ను కట్టివేయకుండా అలాగే వదిలేసి వెళ్తుంటారు. నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీ మీ వద్ద ఉండదు. ఎందుకంటే నీరు ఈ జగతికి దాహార్తిని తీసే అమూల్యమైన వనరు. అందువల్లే లక్ష్మీ దేవికి ఈ విధంగా నీటిని వృథా చేయడం ససేమిరా ఒప్పుకోదు. అవసరాలకు నీటిని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వాటర్ ట్యాప్ ఆఫ్ చేయాలి. నీటి పంపు నుంచి బిందువులు మాదిరి నీరు కిందకు పడుతుందంటే దానర్థం.. మీ వద్ద డబ్బు కూడా అలాగే అయిపోతుందనడానికి సంకేతం. కాబట్టి నీటిని వృథా చేయడం మానుకోవాలి.
ఇంట్లో పావురాలు గూళ్ళు కట్టకూడదు. అలాగే గబ్బిలాలు తిరగకూడదు. దీని వలన ఆ ఇంటి యజమానికి ఆయుష్షు తగ్గుతుంది.
ఇంటి తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దం చేయడం మంచిది కాదు. ఫలితంగా మీ ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది. తలుపులు విరిగిపోయితే వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలి. తలుపులు తెరవడంలో మరియు మూసివేస్తున్నప్పుడు శబ్దం వస్తే తలుపు మధ్యలో నూనెను జోడించడం ద్వారా దాన్ని సరిచేయొచ్చు. ఈ కారణంగా మీ ఇంట్లో మనస్పర్థలు, కలహాలు వస్తుంటే వాటిని వీలైనంత వరకు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
ఆగ్నేయంలో వంటగది ఉంటే, ఆ ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఉత్తరంలో నీటి కుళాయి, లేదా నీటి బిందెలు అయినా పెట్టుకుంటే మంచిది.
మీ ఇంటి గోడల్లో పగుళ్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే గోడలో చీలిక ఉంటే మీ బంధంలోనూ పగుళ్లు ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీ ఇంటి గోడల్లో పగుళ్లు ఉన్నట్లయితే వాటిని వీలైనంత త్వరగా సరిచేయించాలి. పగుళ్లున్న గోడ సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి గోడలు బాగా ఉన్న ఇంట్లో ఉండాలి. అలా కాదని గోడలు బీట్లు ఉన్న ఇంట్లో ఉంటే, ఇక ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు. అందుకే లక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో కొలవడాన్ని ఎప్పుడు మరువకూడదు. ఇంట్లో ఎప్పుడు డబ్బు తాండవించాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించడం ఉత్తమం.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా, పాజటీవ్ ఎనర్జీ రావాలంటే తులసి మొక్కను పెంచాలి. ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించాలి. అలా లేని ఇంట్లో ఉండటం మంచిది కాదు.
ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు. కుబేరుడు డబ్బుకు చిహ్నం. కాబట్టి ఇంటి ఉత్తర దిశను ఎప్పుడూ మురికిగా ఉంచొద్దు. ఉత్తర దిక్కులో పూజలు చేయడం, ప్రతిరోజు దూపదీప నైవేధ్యాలతో స్వామిని కొలవడం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. చెత్తను ఈ దిశలో సేకరించడం మానివేయాలి. ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇంట్లో అదనపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వృథా అవుతుంది. ఫలితంగా లక్ష్మీదేవి ప్రసన్నం కాదు.
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు, గాజు వస్తువులు ఎక్కువగా పగులుతుంటాయి. అయితే వీలైనంత వరకు ఇలా జరగనివ్వకూడదు. పగిలిపోయే వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచండి. ఎందుకంటే విరిగిన బొమ్మలు, వస్తువులు పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అంతేకాకుండా మీ డబ్బు కూడా వృథా అవుతుంది. వీటితో పాటు విరిగిన బొమ్మలు, పేలిన టపాకాయలు లాంటి వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. ఇంట్లో బూజులు ఉండకూడదు. ప్రతీ బుధవారం ఇంటిని శుభ్రపరచుకుంటే మంచిది. వీటిని లక్ష్మీ దేవి శుభంగా పరిగణించదు. ఇంట్లో ప్రతీ గదిలో కూడా వస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలి. ఇలాంటి ఇంట్లో ఉంటె మీకు అదృష్టం కలసి వస్తుంది.
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచి…
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…
నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…
ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, అదే రోజు మొత్తం ఎలా సాగుతుందో నిర్ణయిస్తుందని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. ముఖ్యంగా నిద్రలేవగానే…
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చాలామందికి ఒక సవాల్‌గా మారింది. అయితే కొందరు వ్యక్తులు తమ…