Categories: FeaturedHealth News

ఈ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే కరోనా ముప్పు తప్పినట్టే…?

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా 90 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఎక్కడ, ఎలా ఎవరి నుంచి ఈ వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పైనే కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఎవరైతే విటమిన్ సి, విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడతారో వారు కరోనా బారిన పడే అవకాశాలు దాదాపు ఉండవని వైరాలజిస్ట్ లు సూచిస్తున్నారు. సి, డి విటమిన్ ట్యాబ్లెట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి వైరస్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని ట్యాబ్లెట్లను ఎలా పడితే అలా తీసుకున్నా ప్రమాదమేనని చెబుతున్నారు. అమెరికా ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ ఫాసీ ప్రజలకు ఈ సూచనలు చేశారు. ఎవరైతే విటమిన్ల లోపంతో బాధ పడుతూ ఉంటారో వారు త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందని….. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ట్యాబ్లెట్లను వాడినా ఫలితం ఉండదదని తెలుపుతున్నారు.

మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని… అవసరానికి తగిన విధంగా డి విటమిన్ ఉండేలా చూసుకుని మంచి యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. గతంలో పలు అధ్యయనాల్లో విటమిన్ డి లోపంతో బాధ పడే వారే ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే డాక్టర్ ఫౌసీ మాత్రం విటమిన్ డి తో పాటు విటమిన్ సి ని కూడా తీసుకోవాలని చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago