Movie News

Lakshmi Manchu: అనుష్క వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాను.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు..?

Lakshmi Manchu: ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రసన్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి ఆకట్టుకుంది. ఇలా సినిమాలు, టీవీ షోల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా లక్ష్మి మంచు బాగా పాపులర్ అయింది.

ఎందుకంటే సోషల్ మీడియాలో మంచు లక్ష్మి మీద వచ్చినన్ని మీన్స్ మరి ఏ సెలబ్రిటీ మీద కూడా రాలేదు. లక్ష్మీ మంచు ఏం చేసినా కూడా తప్పుపడుతూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ప్రసన్న హీరోయిన్ అనుష్క గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అనుష్క వల్ల తనకి కోట్ల రూపాయల నష్టం వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్నో టాక్ షోలలో హోస్ట్ గా వ్యవహరించిన లక్ష్మి ఎంతోమంది సెలబ్రిటీలతో ముచ్చటించింది.

ఈ క్రమంలో టాక్ షోలలో హోస్ట్ గా వ్యవహరించేందుకు అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని తిరస్కరించినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ వెల్లడించింది. మాట్లాడిన వాళ్ళతోనే ఎన్ని సార్లు మాట్లాడాలి అని నాకు బోర్ కొట్టి నేను చెయ్యను మొహం మీదనే చెప్పేసేదానిని అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలో ఒక టాక్ షో నిర్వహిస్తున్నప్పుడు ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని గెస్ట్ గా ఆహ్వానించి అధిక మొత్తంలో నష్టపోయినట్లు తెలిపింది.

Lakshmi Manchu: మూడు కోట్ల నష్టం…

ఒక టాక్ షోకి అనుష్క శెట్టిని ఒక వారం ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, ఆమె ముందుగా వస్తానని చెప్పటంతో ఆమె కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాము అంటూ తెలిపింది . వాటి కోసం మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లు తెలిపింది. కానీ ఆ వారం ఆమెకి భాగమతి షూటింగ్ షెడ్యూల్ సడన్ గా ప్లాన్ చెయ్యడం వల్ల మా షో కి రాలేకపోయింది. దాంతో మాకు మూడు కోట్లు నష్టం వచ్చింది అంటూ లక్ష్మి ప్రసన్న చెప్పుకొచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

5 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

6 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

6 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

6 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

6 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

6 hours ago