Singer Raghu Kunche : యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సీరియల్ నటుడుగా, సింగర్ గా వెయ్యికి పైగా పాటలు పాడిన సింగర్ రఘు కుంచె. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలను సినిమాల్లో చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు మ్యూజిక్ అందించి మెప్పించారు. ఇక తనతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన వారిలో రవితేజ, పూరీ జగన్నాథ్ వంటి వారు ఉన్నారు. అప్పటి వారి మధ్య జరిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు రఘు కుంచె.
అలాంటి వారి వల్ల అవకాశాలు పోయాయి…
ఇండస్ట్రీ లో చాలా మంది మనకు పరిచయం ఉన్నా అవకాశం ఇస్తామని చెప్పినా వారి చుట్టూ చేరే కొంతమంది వెధవలు నాకు అవకాశాలు రాకుండా చేసారంటూ రఘు కుంచె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మంచి ప్రాజెక్ట్స్ చేతికి వచ్చినట్టే వచ్చి పోయాయని చెప్పారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా సార్లు ఏడ్చానంటూ చెప్పారు. సినిమాలో సాంగ్స్ అన్ని నేనే కంపోజ్ చేసినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరేవాళ్లతో చేయించుకుంటారు.
నేను అప్పటికే ఆ సినిమా కథకు సరిపోయే లాగా ఒక మ్యూజిక్ నా మైండ్ లో ప్రిపేర్ అయ్యింటాను కానీ నేను చేయలేనని వాళ్ళే డిసైడ్ చేసి నన్ను పక్కకు నెట్టేస్తారు అంటూ చెప్పారు. ఈ విషయంలో కొన్నిసార్లు సదరు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ తోనే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని, ముందు అవకాశం ఇస్తే కదా తెలుస్తుంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా చేయగలనని, అదంతా చెప్పకుండా నావల్ల కాదని వాళ్ళే డిసైడ్ చేసినపుడు బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పారు రఘు కుంచె.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…