Lakshmi Parvathi : నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటనలో ఒక శిఖరం లాంటి ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చారు ఎన్టీఆర్. ఆయన పార్టీ స్థాపించి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సమాజ సేవ చేసారని అందరూ అనుకుంటారు కానీ ఆయన సినిమాల్లో ఉన్నపుడే ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయం చేసారు. అలాంటి మహోన్నత వ్యక్తి కి జనవరి 18న ఆయన వర్ధంతి సందర్బంగా ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి నివాళులు అర్పించి ఆ సమయంలో జగన్ పాలన గురించి ప్రశంసించారు.
జగన్ నాకు జీవితానికి ఇచ్చాడు…
ఎన్టీఆర్ గారు మరణించిన విధంగా ఎవరూ మరణించరాదంటూ లక్ష్మి పార్వతి ఎమోషనల్ అయ్యారు. ఒక రాజులాగా బ్రతికిన ఆయన మరణించే చివరి దశలో ఎంతో బాధ మనోవేదనకు గురై మరణించారు. రాజకీయాల్లో చుట్టూ ఉన్నవాళ్లను ఎవుడూ ఒక కంటే కనిపెడుతూ ఉండాలి, అది ఎన్టీఆర్ గారికి రాలేదు అందరూ తనవాళ్ళే అనుకుని మోసపోయారు. ఆయన జీవితం నేటి రాజకియనాయకులకు గుణపాఠం అంటూ ఎమోషనల్ అయ్యారు లక్ష్మి పార్వతి.
అలానే ఆయన మరణించాక 26 ఏళ్లుగా ఒంటరిగా బ్రతుకుతున్న నాకు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. నా లాంటి ఎంతో మంది ఒంటరి మహిళలు నేడు జగన్ ప్రభుత్వంలో హాయిగా బ్రతుకుతున్నారు. ఎన్టీఆర్ గారి పాలన రామరాజ్యం తలపించేది అలానే ఇపుడు ఎన్టీఆర్ తరువాత జగన్ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అంటూ ప్రశంసించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…