Senior Journalist Bhardwaja : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరి సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఈ సారి పండగకు చిన్న చిన్న సినిమాలు చాలానే ఉన్నా పెద్ద సినిమాలు కూడా పోటీపడ్డాయి. ఓవైపు మెగాస్టార్ మరోవైపు బాలయ్య, వీళ్ళిద్దరి సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసాయి. ఇక వీరి మధ్యలో తమిళ హీరో విజయ్ వారసుడు అంటూ వచ్చాడు. అయితే సంక్రాంతి పండుగ ఆందరికీ సంతోషాన్నిచ్చింది. ఓ వైపు వీర సింహా రెడ్డికి థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుంటే మరో వైపు వాల్తేరు వీరయ్య కు థియేటర్స్ నిండిపోతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను అభిమానులు ఆదరించినా బరిలో ఎవరు ముందంజలో ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ తెలిపారు.
బరిలో ముందంజలో ఉన్న వీరయ్య, కారణం…
భరద్వాజ గారు ఇద్దరు హీరోలకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ ఇప్పటికీ ఇద్దరు హీరోలను సినిమాల్లో అది కూడ ఎంటర్టైన్మెంట్ మాస్ కమర్షియల్ సినిమాలో చూడాలని వారి అభిమానులు కోరుకుంటుండటం సినిమాలకు పెద్ద ప్లస్ అంటూ తెలిపారు. ఇక రెండు సినిమాల విషయానికి వస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం నిజమంటూ తెలిపారు. చిరంజీవి ని తన అభిమానులు ఎలాంటి సినిమాల్లో చూడాలని భావించరో అలాంటి సినిమాల్లో చూసారని ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రిపీట్ ఆడియన్స్ సినిమాకు ఉన్నారంటూ తెలిపారు.
ఇక బాలకృష్ణ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా విడుదల అయి అది కూడా మాస్ ఆడియన్సకి బాగా నచ్చినా రిపీట్ ఆడియన్స్ లేరు అదీ కాక ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపడం లేదంటూ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి నుండి ఎలాంటి సినిమాలను జనాలు కోరుకుంటున్నారో ఆయనకు తెలిసింది అలానే బాలకృష్ణ ఆల్రడీ సక్సెస్ ట్రాక్ లో ఉంటూ మరో సక్సెస్ అందుకున్నారు కానీ సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ అందించి ఉంటే సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…