Lalitha Jewellery owner Kiran : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. రోజూ టీవీలో చూసే యాడ్ లో ఎంతో నిజం ఉంది, అది మనకు తెలుసు కానీ కిరణ్ కుమార్ చెప్పాక ఆలోచించడం మొదలయింది. సాధారణంగా నగల యాడ్ అనగానే ఒక హీరోయిన్ లేక మోడల్ నగలను అలకరించుకుని వచ్చే యాడ్స్ ఇంచుమించు అన్ని బ్రాండ్ల నగల ప్రకటనలు అలానే ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తాడో అలా మా షో రూమ్ లో ప్రయత్నించండి అంటూ అందరినీ తన వైపు చూసేలా చేసుకున్నారు లలితా జ్యువలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు. నగలను మా షో రూమ్ లో కొనండి అని అందరిలా ఆయన చెప్పలేదు. కేవలం మా షో రూమ్ లో నగల ధరలను, నగలను చూసి ఫోటో తీసుకుని ఇతర షో రూమ్ లో నగలతో పోల్చి ఆ తరువాత ఎక్కడ తక్కువ ధరలు లభ్యమవుతాయో అక్కడ కొనుక్కోండి అంటూ చెప్పాడు. ఈ మాటే చాలామంది వియోగదారులను ఆకర్శించింది. అలా ఒక్కో మెట్టు ఏదగిన కిరణ్ గారి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.
సావిత్రమ్మ ఇల్లు సెంటిమెంట్…
లలిత జ్యువలరీ షాప్ చెన్నై లోనిది మొదట ఉన్న ఓనర్ దగ్గర నుండి కిరణ్ గారు కొనుక్కుని అలా వ్యాపారం మొదలు పెట్టి ఆ తరువాత ఎన్నో బ్రాంచ్ లను ఎన్నో ఊర్లలలో రాష్ట్రాలలో మొదలు పెట్టినా చెన్నై లోని లలిత జ్యువలరీ షాప్ మాత్రం ప్లేసు మార్చలేదు. దీనికి కారణం ఆ షాప్ సావిత్రమ్మ గారి ఆస్తి. అయితే కూతురు విజయ చాముండేశ్వరి గారు ఆ షాపింగ్ కాంప్లెక్స్ అమ్మాలని నిర్ణయించుకున్నపుడు కిరణ్ గారు ఆ షాప్ ను కొనేసారు. అలానే అందులో ఉన్న సావిత్రి గారి ఫోటోను కూడా అలాగే ఉంచాలని అడిగి అలానే పెట్టుకున్నారు.
షాప్ పేరు లలిత జ్యువలరీస్ అయినా కూడా ఆ కాంప్లెక్స్ ఉన్న సావిత్రి గణేశన్ అనే పేరును అలానే ఉంచేశారట, కిరణ్ గారు ఆ షాప్ చాలా సెంటిమెంట్ అంటూ చెబుతారు. ఇక సావిత్రి గారిలాగే కిరణ్ గారికి కార్లంటే మహా పిచ్చి. ఆయన వద్ద వ్యక్తిగత కార్లు దాదాపు 40 ఉన్నాయట. అయితే అందులో మాత్రం టాయోటా ల్యాండ్ క్రూజర్ అంటే ఇష్టమంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం లలిత జ్యువలరీ షాప్స్ టర్న్ఓవర్ దాదాపు సంవత్సరాని 1400 కోట్లదాకా ఉందని, ఇక ఆయనకు 200 కోట్ల ఆస్తి ఉందంటూ కిరణ్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…