Categories: FeaturedMovie News

Director Bobby : నాన్న చనిపోయే ముందు చిరంజీవి గారి ఇంట్లో.. రెండు గంటలు ఏం చెప్పారంటే… పవన్ కళ్యాణ్ కి మొహమాటం లేదు…: డైరెక్టర్ బాబీ

Director Bobby : ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదిగిన చిరు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలను చూస్తూ ఆయనను అభిమానించే ఎన్నో కోట్లమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడం జరగలేదు. వేరొకరు ఆయన మీద బురదజల్లిన కూడా ఓర్పుగా వ్యవహారించారు కానీ ఎవరితోను పరుషంగా మాట్లాడలేదు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు అంటూ వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ చెబుతున్నారు. మెగాస్టార్ సినిమాలను చూసే ఇండస్ట్రీకి వచ్చానంటూ చెప్పిన బాబీ ఆయనతో పనిచేసిన అనుభవాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్నకోసం మెగాస్టార్ చేసిన పనికి…

డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ మెగాస్టార్ అసలు ఎందుకంత స్పెషలో తెలిపారు. తన తండ్రికి కాన్సర్ వచ్చి బాధపడుతున్న సమయంలో ఇక ఆయన మాకు దక్కరని రోజులు లెక్కబెడుతున్న సమయంలో ఈ సినిమా ఆయన చూడకుండానే వెళ్ళిపోతారేమో అని నేను చాలా భయపడ్డాను కానీ చిరంజీవి గారు నాకు ఆలోటు లేకుండా చేసారు అంటూ చెప్పారు. బాబీ తండ్రి గారు చిరుకి పెద్ద ఫ్యాన్ అవడంతో కొడుకు తన అభిమానం నటుడిని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా చూడాలని ఆశ ఆయనలో ఉండేదట.

అయితే అప్పటికే క్యాన్సర్ ముదిరిపోవడం వల్ల ఆయన ఎక్కువ రోజులు ఉండరని చెప్పడంతో బాబీ ఆయనను చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ దాదాపు రెండు గంటల సేపు ఆయనతో చిరంజీవి గారు మాట్లాడి సినిమా ఎంత సక్సెస్ అవుతుందో ఆ తరువాత బాబీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్ని వివరించి చెప్పి చిరంజీవి గారు ఆయన సొంతోషాన్ని పంచుకున్నారట. సినిమా విడుదల సమయానికి తన తండ్రి లేకపోయినా ఆయన ఆల్రడీ నా సినిమా సక్సెస్ చూసారు అన్న తృప్తి నాకుంది అంటూ బాబీ అందుకే మెగాస్టార్ స్పెషల్ అంటూ చెప్పారు. ఇక ఆయన ఒకరిని కూడా చిన్న మాట నొప్పించేలా అనరని అందుకే ఆయన పాలిటిక్స్ కి పనికిరారంటూ ఆ పని ఆయన తమ్ముడు పవన్ చేయగలడని, తాను ఎవరైనా తేడాగా మాట్లాడితే అక్కడే వారికి బుద్ధి చెబుతారని, పవన్ గారిలో ఉన్న ఎన్నో మంచి లక్షణాలకు కారణం చిరంజీవి గారే అని ఆయనతో పనిచేసినపుడు అర్థమైందంటూ తెలిపారు బాబీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago