Nagarjuna: మనిషి అన్న తర్వాత వారికి కొన్ని కోరికలు ఉండటం సర్వసాధారణం. మనిషి కోరిక తీరాలి అంటే డబ్బు అవసరమని చాలా మంది భావిస్తుంటారు కానీ డబ్బు ఉన్న కూడా తీరని కోరికలు చాలా ఉన్నాయి. అలాంటి ఓ తీరని కోరిక నాగార్జునలో కూడా ఉందని తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచిగా సక్సెస్ అందుకున్నారు. ఆయన కోరుకుంటే ఆ కోరిక క్షణాలలో తీరిపోతుంది కానీ ఈయనకి కూడా ఒక తీరని కోరిక ఉందని తెలుస్తుంది.
నాగార్జున హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ధనవంతులు అయిన హీరోల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. వేలకోట్ల ఆస్తిపాస్తులు కలిగిన నాగార్జునకు ఒక విషయంలో మాత్రం భారీగా లోటు ఉందని తెలుస్తుంది.
నాగార్జునకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమట తనకు ఒక అమ్మాయి పుడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ తనకు ఇద్దరు కుమారులే పుట్టారు. అలా అమ్మాయి కావాలని కోరిక నాగార్జునకు అలాగే ఉండిపోయిందని ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. అమలకు కచ్చితంగా పాప పడుతుందని ఈయన అనుకున్నారట. డాక్టర్స్ కూడా పాపే పుడుతుందని చెప్పడంతో తాను ముందుగా పాపకు కావలసిన వస్తువులు అన్నీ కూడా కొనుగోలు చేశానని డెలివరీ అయ్యాక చూస్తే అఖిల్ పుట్టారు అంటూ నాగార్జున తెలిపారు.
ఇలా బాబు పుట్టడంతో అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి ఇంకొకరిని ప్లాన్ చేయలేదని నాగార్జున తెలిపారు. అందుకే కూతురు కావాలనే కోరిక అలాగే ఉండిపోయిందని ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి కుమార్తెలు కావాలనే కోరిక తీరకపోయిన కనీసం మనవరాలు పుడితే నాగార్జున కొంతవరకు హ్యాపీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ కోరిక అయినా తీరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…