Raj Tarun: సినీ నటుడు రాజ్ తరుణ్ వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది. ఈయన లావణ్య అనే యువతీతో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేయడమే కాకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారని, అయితే ప్రస్తుతం ఈయన మాల్వి మల్హోత్రతో ప్రేమలో పడి నన్ను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ లావణ్య అనే యువత కొద్ది రోజులుగా హీరో రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విధంగా హీరో గురించి ఇలాంటి ఆరోపణలు చేయడమే కాకుండా రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకోవడమే కాకుండా తనకు రెండుసార్లు అబార్షన్ కూడా చేయించారు అంటూ ఈమె సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే త్వరలోనే రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా స్వామి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈయన ఇటీవల ప్రసాద్ ల్యాబ్లో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న లావణ్య ఏకంగా ప్రసాద్ ల్యాబ్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తనకు తన భర్త రాజ్ తరుణ్ కావాలని ఈమె డిమాండ్ చేశారు. మాల్వీ సినిమాలు చేయడం కోసమే వస్తే సినిమాలు మాత్రమే చేసి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండే దానిని కాదు మీరు గత కొద్దిరోజులుగా పగలు రాత్రి ఎంతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారని ఈమె ఆరోపణలు చేశారు.
ఇక రాజ్ తరుణ్ గురించి నేను ఎన్నో విషయాలు దాచి పెట్టాను ఆ నిజాలు అన్ని బయట పెడితే అందరూ తనని తూ అని ఉముస్తారంటూ లావణ్య ఆయనపై చేసిన ఆరోపణలు సంచలనగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రాజ్ తరుణ్ కూడా స్పందించారు. ఇన్ని రోజులు నా ఇమేజ్ డామేజ్ అవుతుందన్న కారణంతోనే నేను మాట్లాడలేదని తెలిపారు. ఈమె కారణంగా నేను మాత్రమే కాకుండా నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుందని వెల్లడించారు.
కోర్టులోనే తేల్చుకుంటా…
నేను తనకి అబార్షన్ చేయించాను అని చెబుతోంది ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి తను మాత్రమే కాదు నా దగ్గర కూడా చాలా ఫోటోలు వీడియోలు ఉన్నాయని వాటిని నేను కోర్టులో సబ్మిట్ చేస్తానని ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది కనుక తాను కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…