మెగాస్టార్ చిరంజీవి అరవై పదుల వయసులో కూడా యువ హీరోలకి ధీటుగా వరుస సినిమాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న చిరూ.. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా, బాబీ, మెహర్ రమేష్ వంటి దర్శకులతో తన తదుపరి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక తాజాగా చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన టైటిల్స్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లూసిఫర్ చిత్రానికి ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, కేఎస్ రవీంద్ర, మెహర్ రమేష్ రూపొందించే సినిమాలు స్ట్రెయిట్ సినిమాలు. ఇప్పటికే స్క్రిప్టు ఫైనల్ అయినట్టు తెలుస్తున్నది. అయితే గత రెండు రోజులుగా బాబీ, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం పేరు వీరయ్య అని ప్రచారం అవుతున్నది. అయితే పీఆర్ వర్గాలు ఆ టైటిల్ కాదంటూ ఖండించారు. అయితే తాజాగా లూసీఫర్ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ తెరపైకి వచ్చింది. మోహన్ రాజా, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి రారాజు అని పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. గతంలో ఇదే టైటిల్‌తో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.రారాజుగా ప్రచారమవుతున్న చిరంజీవి సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్‌వీఆర్ ఫిల్మ్స్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తున్నది.
అయితే ఈ టైటిల్‌ను మెగా టీమ్ నిజంగా పరిశీలిస్తున్నదా అనే విషయం కొద్దిరోజులు ఆగితే తెలియడం ఖాయం. అయితే ఈ టైటిల్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చ జరుపుతున్నారు.. ఇక లూసిఫార్ సినిమా ఉగాది తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…