కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మాస్కులు ధరించని వారిపై గట్టిగా యాక్షన్ తీసుకుంటోంది జీహెచ్‌ఎంసీ యంత్రాంగం. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజగా ఫతేనగర్‌లో మాస్క్ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించినందుకు ఒక షాపు యజమానికి 2 వేల రూపాయిలు జరిమానా విధించారు జిహేచ్ఎంసీ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది.
ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలను మరింత కఠీనం చేసారు అధికారులు. మాస్క్ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…