కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మాస్కులు ధరించని వారిపై గట్టిగా యాక్షన్ తీసుకుంటోంది జీహెచ్‌ఎంసీ యంత్రాంగం. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజగా ఫతేనగర్‌లో మాస్క్‌ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించినందుకు ఒక షాపు యజమానికి 2 వేల రూపాయిలు జరిమానా విధించారు జిహేచ్ఎంసీ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది.

ఈ క్రమంలో కొవిడ్‌ నిబంధనలను మరింత కఠీనం చేసారు అధికారులు. మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here