సాధారణంగా క్రికెటర్స్ హీరోయిన్స్ వెనుక పడతారు. వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ కన్నా ముందు చాలామంది క్రికెటర్లు సినీ తారలని జీవిత భాగస్వామిని చేసుకున్నారు.
అయితే టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మాత్రం యాక్టర్ ని కాకుండా ఓ డాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. డాక్టర్ ధనశ్రీతో చాహల్ పెళ్లి ఫిక్సయింది. ఇదే విషయాన్ని చాహల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ.. ట్విట్ చేశాడు. ‘డాక్టర్ ధనశ్రీతో నా పెళ్ళికి 2 కుటుంబాల పెద్దలు ఓకె చెప్పేశారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చాహల్ తన కాబోయే జీవిత భాగస్వామితో కలిసి దిగిన ఫొటోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ధనశ్రీ కేవలం డాక్టర్ మాత్రమే కాదు.. కొరియోగ్రాఫర్ కూడా.! యూట్యూబ్ లో కొన్ని వీడియోలకు కొరియో గ్రాఫర్ కూడా చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా చహల్ ఇంటికే పరిమితమయ్యారు. త్వరలోనే IPL ఆడేందుకు UAE వెళ్లబోతున్నారు.
కరోనా లాక్ డౌన్ మూలంగా క్రికెట్ మ్యాచ్ లు రద్దు కావడంతో బౌలింగ్ ను తాను చాలా మిస్సవుతున్నానని, అందుకే లాక్డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చెప్పారు. ఇక ఎక్కువ కాలం ఇంట్లో ఉండలేను. ప్రస్తుతం ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నందుకు కనీసం మూడేండ్ల పాటు తిరుగుతూనే ఉంటా. దగ్గర్లో ఉన్న హోటల్లో అయినా ఉంటాను గానీ ఇంట్లోకి మాత్రం వెళ్లను” అని చాహల్ సరదాగా చెప్పారు. “నాకు మైదానానికి వెళ్లాలని, బౌలింగ్ చేయాలని ఉంది. గ్రౌండ్ లో ఉంటే చాలా హ్యాపీగా వుంటుంది. లాక్డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళ్లి ఒక్క బంతైనా వేస్తా” అని చాహల్ ఈ సందర్భంగా తెలియజేశారు. UAE లో IPL సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 10 వరకు జరగబోతుందన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…