చిరుతపులి దేనినైనా వేటాడిందంటే..దాని నుంచి కాపాడుకోవడం ఎవరి వల్ల కాదు. అంతాల తన వేట కొనసాగుతుంది. ఇలా పులి, పిల్లిని వేటాడుతూ.. దగ్గర్లోని బావిలో పడిపోయాయి. పిల్లి తొందరగానే గట్టుకు చేరుకుంది. కానీ పులి కూడా గట్టుకు చేరింది. దీంతో ఆ పిల్లి పరిస్థితి మాత్రం.. ఆగమ్యగోచరంగా మారిన ఘటన మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి విరాల్లోకి వెళ్తే..
ఆ పల్లి చిరుతపులి కంట పడింది. ఇంకా ఏమైనా ఉందా.. వేట మొదలు పెట్టింది. ఇలా తనకు తాను రక్షించుకోవడం కోసం.. పిల్లి తప్పించుకోబోయి.. పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో పడిపోయింది. దీంతో పాటు చిరుతపులి కూడా అందులోనే పడిపోయింది. దీంతో పిల్లి వెంటనే బావిలోపల గల గట్టుపైకి ఎలాగోలా చేరుకుంది. తర్వాత అది అక్కడ నుంచి ఎటూ వెళ్లలేక అక్కడనే ఉండిపోయింది.
దీంతో చిరుత పులి.. పిల్లి ఉన్న ప్రదేశానికి వచ్చి.. దానిని ఎటాక్ చేసింది. పిల్లి కూడా కాసేపు డిఫెన్స్ చేసింది. కానీ చిరుత కింద.. పిల్లి ఒక లెక్కా.. మళ్లీ దూకుడుగా చిరుత పిల్లిపైకి ప్రవర్తించగా.. ముందు రెండు కాళ్లతో దండం పెట్టేంత పని చేసింది పిల్లి. దీంతో చిరుతకూడా దానిని ఏం చేయకుండా అలా ఉండిపోయింది.
దీనికి సంబంధించిన ఈ 16 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లి భయంతో వణికిపోతున్న దృశ్యం.. అలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లిని.. చిరుత పులి జాలిగా చూడటం నెటిజన్లను ఆకర్షిస్తోంది. చివరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వాటిని బావిలో నుంచి బయటకు తీశారు. చిరుతను పట్టుకున్న అధికారులు.. పిల్లిని వదిలిపెట్టారు. బతుకుజీవడా అనుకొని పిల్లి అక్కడ నుంచి పారిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…