కొంతమంది రుచులు, అభిరుచులు, ఇష్టాలు అందరి కంటే భిన్నంగా ఉంటాయి. వాటిని చూసినా.. విన్నా మనకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అలాంటి కోవలోకి వస్తాడు ఈ లైబ్రేరియన్. సోషల్ మీడియాను కొంతమంది మంచికి ఉపయోగిస్తే.. మరికొంత మంది చెడుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ లైబ్రేరియన్ సోషల్ మీడియాలో చూసి గర్డెనింగ్ ఎలా చేయాలో నేర్చుకొని ఇతరులకు ఆదర్శంగా నలిచాడు. వివారాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కు చెందిన గణేష్ కులకర్ణి స్తానికంగా లైబ్రేరియన్ గా పనిచేసేవాడు.
అయితే గార్డెనింగ్ అంటే గణేష్ కు చాలా ఇష్టం. మొక్కలను ఎలా పెంచాలి.. ఏ విధంగా వాటిని సంరక్షించాలి అనే అతడు నిత్యం ఆలోచిస్తుండేవాడు. కొన్ని మొక్కలను తెచ్చి ఇంట్లో నాటేవాడు.. కానీ వాటికి పోషకాలు అందక చనిపోయేవి. అందులో ఎక్కువగా గులాబీ మొక్కలు ఉండేవి. అయితే అతడు చాలా బాధపడేవాడు. ఇలా కాకుండా తెచ్చిన మొక్కలకు పోషకాలు ఇవ్వడానికి ఏం చాయాలి. గార్డెనింగ్ ను ఎలా చేయాలనే విషయాలను సోషల్ మీడియాలో చూస్తూ నేర్చుకున్నాడు.
ఫేస్ బుక్ లో గార్డెనింగ్ కు సంబంధించిన మెళకువలను నేర్చుకున్నాడు. వెంటనే తన ఇంటి మీద గార్డెనింగ్ చేయడం ప్రారంభించాడు. కాయగూరల మొక్కలు, పండ్ల మొక్కలు వంటివి పెంచాడు. సరదాగా ప్రారంభించిన గార్డెనింగ్ ఇప్పుడు ఓ వ్యాపకంగా మారింది. ఇలా మొక్కలపై ఉన్న మమకారం అతడు పొద్దున లేచిన తర్వాత వాటిని చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాడు.
కరోనా కాలంలో అతడు మరో ఇంటికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అక్కడ కూడ అతడు ఇలానే చేశాడు. ప్రస్తుతం తన ఇంటి మీద 200 రకాల కూరగాయలు, పండ్లు, పువ్వుల చెట్లను పెంచుతున్నాడు. గార్డెనింగ్ లో అతడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంట్లో కూరగాయలను ఇస్తూ.. మిగిలినవి మార్కెట్లో విక్రయిస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇతరులకు గార్డెనింగ్ , అర్బన్ గార్డెనింగ్ ఎలా చేయాలో నేర్పుతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…