భారతదేశంలో కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ ను మరి కొన్ని యాప్ లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే టిక్ టాక్ కు ఉన్న ఆదరణ మాములుది కాదు. అంతలా డౌన్ లోడ్ చేసుకున్నారు నెటిజన్లు. తాజాగా టిక్ టాక్ నుంచి ఓ వార్త వచ్చింది. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ రికార్డు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు అత్యధికంగా డౌన్ లోడ్ చేయబడిన సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్. దీనిని షార్ట్ వీడియో యాప్ అయిన టిక్‌టాక్ వెనక్కి నెట్టి రికార్డు స్పష్టించింది. దీని గురించి ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా ఇలా తెలిపింది. 2020 సంవత్సర కాలంలో అత్యధిక యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు తెలిపింది. భారత్ లో నిషేధానికి గురైనా ప్రపంచవ్యాప్తంగా మాత్రం టిక్ టాక్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.
అత్యధిక మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలవడం గమనార్హం. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే.. త్వరలో భారత్ లో కూడా టిక్ టాక్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే టిక్ టాక్ తన మార్కెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లింది. దీంతో ఈ ఘనతను సునాయాసంగా సాధించిందని నిక్కీ ఏషియా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డౌన్‌లోడ్‌లో విషయంలో 2019లో సంవత్సరంలో టిక్‌టాక్ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అత్యధిక డౌన్ లోడ్ కలిగిన యాప్స్ లో ఫేస్‌బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్‌లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి. భారత్ లో మళ్లీ టిక్ టాక్ విడుదల అయితే యూజర్లతో పాటు డౌన్ లోడ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతాయని నిక్కీ ఏషియా తెలిపింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…