నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో అయితే భారీ నుంచి అతి భారీవర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి.
పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో పాటు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. దీంతో జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది.
ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే అతడు కూడా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంలో రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…