ప్రభుదేవా అంటే తెలియని వారుండరు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దక్షిణ భారతదేశంలో అతడు తన డ్యాన్స్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. తొలుత ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్ గా అడుగుపెట్టిన ఆయన.. అనతీ కాలంలోనే ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేశాడు.
ఇలా తాను కొరియోగ్రఫి చేసిన సినిమాలు పెద్ద హిట్ కావడంతో టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. తర్వాత చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ మైకేల్ జాన్సన్‌గా పేరొందిన ఆయన తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్కడి సినిమాలను హిందీలో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నారు.
కొన్నాళ్లుగా ప్రభుదేవాకి పెద్దగా సక్సెస్‌లు రావడం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు. అతడికి నటుడిగా ఎక్కవ అకాశాలు వస్తున్నాయన్న కారణంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన ‘భగీరా’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. కాగా, ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ప్రభుదేవా హీరోగా నటించిన సినిమా ‘ప్రేమికుడు’ అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. ముక్కాళ్లా సాంగ్ కు అతడి డ్యాన్స్ అమోఘం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…