కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆ సమయంలో వాళ్ల పక్కన నిల్చుందామన్నా ఉండాలని అనిపించదు. వాళ్లకు చెబుదామంటే.. ఎక్కడ నొచ్చుకుంటారనే బాధతో చెప్పలేం. అయితే అలాంటి వాళ్లు ఏం చేయాలి.. దుర్వాసన రాకుండా ఎలాంటి చిట్కాలు వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం లేవగానే సాధారణంగా పళ్లు తోముకోవడం అనేది అందరూ చేస్తుంటారు. కానీ పళ్లు తోముకున్నా నోటి నుంచి దుర్వాసన అనేది పోని వాళ్లు ముఖ్యంగా నాలుకను టంగ్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి. అది ఒక్కపూట కాదు రెండు పూటలు (ఉదయం, రాత్రి) చేయాలి.
అన్నాశయంలోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన గల వాయువులను ఏర్పరుస్తుంది. ఇవి నోటినుండి బయటకు వదలబడతాయి. దాంతో నోటి దుర్వాసన వస్తుంది. తిన్న తర్వాత ఆహారం నాలుకపై పేరుకుపోతుంది. ఇది కూడా దుర్వాసనకు కారణం అవుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఆ వాసన నుంచి బయటపడొచ్చు.
కాఫీ, టీలకు బదులు దీనిని భాగం చేసుకోవాలి. కొబ్బరి మరియు కొబ్బరి నూనెలతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని నాలుగైదు సార్లు పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసనను చెక్ చెట్టేయొచ్చు. ఇక చివరగా క్యారెట్లు, ఆపిల్ వంటి వాటిని రోజూ తినాలి. ఇలా చేయడం వల్ల పళ్లపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకున్న మలినాలు శుభ్రం అవుతాయి. దీంతో దుర్వాసన లేకుండా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…