Alcohol: మందుబాబులకు మహారాష్ట్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై మందు కోసం గంటల తరబడి వైన్ షాప్ ముందు బారులు తీరేరోజులు పోయాయని ఇకపై దర్జాగా సూపర్ మార్కెట్లో కూడా మద్యం కొనుగోలు చేయవచ్చని మహా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా సూపర్ మార్కెట్ లోనూ అలాగే వాక్-ఇన్ స్టోర్లలో మద్యం అమ్మకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మందుబాబులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన ప్రకారం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1000 చదరపు అడుగులు లేదంటే అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఉన్న సూపర్ మార్కెట్ లో ఇకపై మందు అందుబాటులో ఉంటుంది.
అదేవిధంగా దుకాణాలలో సెల్ఫ్ ఇన్ షాప్ పద్ధతిలో మందు అమ్మకాలు చేపట్టవచ్చు. అయితే ముందుగా సూపర్ మార్కెట్ యజమానులు అమ్మకాల కోసం లైసెన్స్ కింద ప్రభుత్వానికి ముందుగా 5000 చెల్లించాల్సి ఉంటుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు అదనపు ఆదాయం కోసమే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని తెలిపారు.రైతులకు ఆదాయాన్ని అందించే వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించాలని ఈ మేరకు ప్రభుత్వం తెలిపింది. అయితే స్కూలు ప్రార్థన మందిరాలకు దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్ లలో మద్యం అమ్మకాలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలలో పట్ల తీసుకున్న ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేయగా బిజెపీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకత చూపిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…