కరోనా నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మే 3 నుంచి 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేసులు పెరగడం, తగ్గడాన్ని బట్టి జోన్లను నిర్ధారించుకునే వెసులుబాటును కల్పించింది.
అయితే రెడ్ జోన్లలో ఎటువంటి మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పింది కేంద్రం, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం మే 17 వరకు వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లక్స్ మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…