హీరోయిన్ నయనతార లవ్, బ్రేకప్స్ అనేవి కొత్తేమి కాదు.. ఎప్పటినుంచో వింటున్న వార్తలే.. చిన్నపిల్లాడిని అడిగినా నయనతార లవ్ ఎఫైర్స్ గురించి టాక్ మని చెబుతాడు. ఇప్పటికే రెండు సార్లు ప్రేమించి, విడిపోయిన ఆమె ముచ్చటగా మూడోసారి కూడా అదే చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట శింబు, ఆ తరువాత ప్రభుదేవా లతో ఘాడమైన ప్రేమలో మునిగి ఆ తరువాత వారిని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే లిస్ట్ లోకి వచ్చేసారు దర్శకుడు విగ్నేష్ శివన్. ప్రస్తుతం గత కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి ఉండటంలేదని, వీరిద్దరూ విడిపోయారని తమిళ మీడియా కోడై కూస్తోంది.
ఇదంతా చూస్తుంటే నయనతారకు పెళ్లి గండంతో పాటుగా ప్రేమ గండం కూడా ఉందేమో అనిపిస్తోంది. మొదట హీరో శింబుతో ప్రేమ, ఆ ప్రేమ కాస్త పెళ్లివరకు వస్తుంది, రేపోమాపో శింబుతో పెళ్లిపీటలు ఎక్కేస్తుంది అనుకునే సమయంలో హఠాత్తుగా విడిపోయింది. ఇక నయనతార రెండో ప్రేమ ప్రభుదేవాతో కూడా అచ్చం అటువంటి సీనే రిపీట్ అయింది. అంతా సాఫీగా జరుగుతుంది. త్వరలో ప్రభుదేవా మూడు ముళ్ళు వేస్తాడు అనుకున్న సమయంలో తన మనసు మార్చుకుని విడిపోయింది.
కాగా, మూడో ప్రేమ విగ్నేష్ శివన్ తో గత కొద్దీ కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుతున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ గత మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు విగ్నేష్ తో కూడా విడిపోయిందని తెలుస్తోంది. అంతేకాదు మరో కుర్ర దర్శకుడితో నయన్ ప్రేమలో పడిందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విగ్నేష్ తో అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య మాటమాట పెరిగి విడిపోయేవరకు దారి తీసిందని, అందుకే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి ఉండటం లేదని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నయన్ తార మూడోసారి కూడా బ్రేకప్ చెప్పడంపై ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…