Categories: FeaturedGeneral News

బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ కు తెరపడినట్టేనా..!? లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు??

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 తో ముగియనుంది. ఇదే క్రమంలో తెలంగాణలో లాక్ డౌన్ కు తెరపడనున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. అవి కూడా జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇటీవల కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇవి తప్ప దాదాపు మిగిలిన జిల్లాలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు గుర్తించారు. గతంలో అధికంగా కేసులు నమోదయిన చోట కూడా ప్రస్తుతం కొత్తగా కేసులు నమోదు అవకపోవడం ఆనందించాల్సిన విషయం. ఇదివరకు కేసులు నమోదైన వరంగల్, కరీంనగర్, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు దాదాపు కరోనా వ్యాప్తి నుంచి బయటపడ్డాయి.

గతంలో వరంగల్ లో 27, కరీంనగర్ లో 18 పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. అందులో ప్రస్తుతం కరీంనగర్ కు చెందిన వ్యక్తి ఒక్కరే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు డిశ్చార్జ్ అయి హోమ్ క్వారంటైన్ లో కొనసాగుతున్నారు. మరోవైపు వరంగల్ లో కేవలం 4 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగా, కొత్తగా కేసులు నమోదు దాదాపు లేవనే చెప్పాలి. ఈ క్రమంలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ అని చెప్పినా… ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మే 7 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో అనధికారికంగా లాక్ డౌన్ ప్రభావం కనిపించడం లేదు. వ్యవసాయానికి సంబంధించిన పనులు ఇప్పటికే జోరు అందుకున్నాయి. ఈ దశలో దశల వారి లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. మే 8 తరువాత పట్టణాల్లో, దుకాణాలకు తెరిచేందుకు అనుమతిస్తారని సమాచారం. అంతేకాకుండా ఫ్యాక్టరీలు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆంక్షలతో కూడిన కార్యకలాపాలు మొదలవుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మే 3 న ప్రధాని నరేంద్రమోడీ ఆంక్షలతో కుడిన లాక్ డౌన్ ఎత్తివేత పై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

9 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

9 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

9 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

9 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

9 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

9 hours ago