ప్రముఖ హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేపటి క్రితం మరణించారు. ఇటీవలే “న్యూరోఎండోక్రిన్ ట్యూమర్” అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి నుంచి పోరాడి ఇండియా కు తిరిగివచ్చారు ఇర్ఫాన్ ఖాన్. గత ఏప్రిల్ 25 న ఇర్ఫాన్ ఖాన్ తల్లి కూడా కన్ను మూసారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్ ఖాన్. తన తల్లి అంత్యక్రియలను వీడియో మాధ్యమంగా ద్వారా వీక్షించి తల్లడిల్లిపోయారు ఇర్ఫాన్. కన్న తల్లి మరణించి నాలుగైదు రోజులు కూడా కాలేదు… అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో మరణించడం హృదయవిదారకం. ఇర్ఫాన్ అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ను ముంబై లోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. 54 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా అయన కోలుకోలేకపోయారు. గత కొన్ని రోజులుగా అయన క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. లండన్ లో చికిత్స తీసుకుని ఇటీవలే భారత్ తిరిగి వచ్చారు. అయన కోలుకోగానే రీసెంట్ గా “అంగ్రేజీ మీడియం” అనే సినిమాలో నటించారు. అదే అయన చివరి చిత్రంగా మిగిలిపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…