నగరంలోని ప్రముఖ బేకరీ అయిన కరాచీ బేకరీలో దొంగలు పడ్డారు. లాక్ డౌన్ సమయంలో దొంగలు వీరవిహారం చేయడంపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు నగర వాసులు. పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మొహంజహి మార్కెట్ చౌరస్తాలో కరాచీ బేకరీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు విధించడంతో అప్పుడప్పుడు మాత్రమే తెరుస్తున్నారు బేకరీ యాజమాన్యం.
అయితే బుధవారం ఉదయం యధావిధిగా బేకరీని తెరిచిన వచ్చిన యాజమాన్యం లాకర్ తాళం పగలగొట్టి ఉండడం చూసి హవాక్కయ్యారు. అందులో ఉండవలసిన 10 లక్షల నగదు కూడా కనిపించడకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనితో అక్కడకి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వేడ్, క్లూస్ టీం లు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అయితే భవనం మధ్యలో ఉన్న చిన్న సందు నుంచి దొంగలు ప్రవేశించినట్టుగా ప్రాధమికంగా నిర్ధారించారు. వెనుకే పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా ఎలా దొంగతనం చేసారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది బయటివారు చేసిందా లేక తెలిసిన వారిపైనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…