Love Today: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని కొంతమంది ఒకే ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది హీరో హీరోయిన్లు ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. తాజాగా లవ్ టుడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ ఇవానా షాజీ. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఇవానా షాజీ “లవ్ టుడే” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమాలో ఇవానా నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదట తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నిఖిత పాత్రలో నటించిన ఇవానా తన అందం, అభినయంతో యువకుల మనసులు దోచుకుంది. తన నటనతో ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించింది.
ఇలా ఈ సినిమా ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్న ఇవానా బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవటానికి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. బాలనటిగా మలయాళీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇవానా మంచి గుర్తింపు పొందింది. ఇక గతేడాది హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్స్, పద్మిని, హీరో వంటి సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల ప్రదీప్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమాలో నటించి ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లవ్ టుడే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో పాపులర్ అయిన ఇవానా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన , ఫోటోలు వీడియోలు షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇలా అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు లవ్ టుడే సినిమాలో నటించి హీరోయిన్ గా కూడా పాపులర్ అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో అటు తమిళ్ భాషలలో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…