Lyric Writer Sirasri : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదల అయిన తరువాత ఆ సినిమాలోని లిరిక్స్ మీద చర్చలు జరుగుతున్నాయి. అందులో శివ దూషణ జరిగిందంటూ కొంతమంది విమర్శలు చేయడంతో చర్చకు దారితీసింది. అసలు వివాదం ఎలా మొదలయింది, యండమూరి వీరేంద్రనాథ్ మధ్యలో ఎలా వివాదంలోకి వచ్చారు అన్న విషయాలను పాటల రచయిత సిరా శ్రీ వివరించారు.
యండమూరి చెప్పినదేమిటి, వివాదం ఎందుకు…
సిరా శ్రీ పాటలోని ఒక్కో వాఖ్యం గురించి మాట్లాడుతూ పాటలో చంద్రబోస్ గారు విరుద్ధ భాషాలంకార ప్రయోగాన్ని చేసారంటూ తెలిపారు. అందుకే రెండు విరుద్ధమైన విషయాలను ఒకే వాఖ్యంలో జప్పించి హీరోను వర్ణించారని, ఇలా ఇంతకు ముందు కూడా కవులు చేసారంటూ తెలిపారు. ఇక పాటలో తిమిర నేత్రుడై త్రినేత్రుడై అనే పదాలు ఇప్పుడు చర్చకు దారితీసాయి అంటూ చెప్పారు. తిమిర నేత్రుడు అనగా చూడలేనివాడు, చీకటి కన్ను కలవాడు అనే అర్థం వస్తుందని సిరా శ్రీ చెప్పారు. ఇంతకు ముందు నారాయణ రెడ్డి గారు ఒక పాటలో తిమిర నేత్రుడు అనే పదం ధృతరాస్ట్రుడి గురించి వార్ణించడానికి అతనికి కన్నులు లేవని చెప్పే వర్ణనలో వాడారు.
ఇక్కడ తిమర నేత్రుడై అయిన త్రినేత్రుడై అన్న ప్రయోగంలో వాడారు చంద్రబోస్. అంటే చీకటి కన్నుల వాడైనా త్రినేత్రుడిలాగ అన్నీ చూడగలడు అనే అర్ధంలో హీరోని వర్ణించారు అందులో తప్పు లేదు, ఇందులో శివ దూషణ లేదంటూ చెప్పారు సిరా శ్రీ. ఇక యండమూరి గారు వేరొకరి పోస్ట్ ను రీ పోస్ట్ చేస్తూ అర్థం వివరించామని అడిగారే కానీ ఆయన వివాదానికి తెరలేపలేదని క్లారిటీ ఇచ్చారు సిరా శ్రీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…