Featured

M. M. Sreelekha : రాజమౌళి డైరెక్టర్ అయ్యాక మారిపోయాడు… వీళ్లెవ్వరి సపోర్ట్ నాకు లేదు…!

M. M. Sreelekha : తెలుగు ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి చిత్రాలకు చేసి పేరు తెచ్చుకున్న ఎమ్ ఎమ్ శ్రీలేఖ ఈ మధ్య సినిమాలకు సంగీతం అందించడం లేదు. అలాగే సింగర్ గా కూడా బాగా ఫేమస్ అయిన శ్రీలేఖ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు, సినిమా వివరాలు చెప్పకూడదని చెప్పడం లేదని తాజా ఇంటర్వ్యూ ల్లో తెలిపారు. ఇక రాజమౌళి, కీరవాణి అన్నయ్యలు అయినా ప్రస్తుతం వారి సినిమాల్లో ఎందుకు పని చేయలేదో వివరించారు.

రాజమౌళి మారిపోయాడు…

రామానాయుడు గారి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన శ్రీలేఖ ఎందుకని తన సోదరులతో కలిసి ఇప్పుడు పనిచేయడం లేదని విషయానికి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి చాలా ఫ్రెండ్లి గా ఉంటాడని తన మొదటి సీరియల్ శాంతినివాసం కి నేనే మ్యూజిక్ చేసానని చెప్పారు. ఇంక తాను సినిమాల్లో బిజీ అయ్యాక ట్రాక్ చేంజ్ అయిందని అలా మార్పు వచ్చిందని ప్రొఫెషనల్ గా ఎవరికి వారే అన్నట్లు ఉంటాము, కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ కలుస్తాము. పండగలకు కలిస్తే చాలా సందడిగా ఉంటుంది అంటూ చెప్పారు. శ్రీలేఖ తండ్రి గారు స్పిరిచువల్ వ్యక్తి అని, ఎప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలో ధ్యానం చేసుకుంటూ ఉంటారని చెప్పారు.

కీరవాణి వారి తండ్రి శివ శక్తి దత్త మొదటి వాడు, ఆయన తరువాత ఐదు మందిలో విజయేంద్ర ప్రసాద్ చివరి వాడు అంటూ వివరించారు. ఇక రామా నాయుడు గారి సినిమాల్లో కొన్నింటికి ఎందుకు మీరు చేయలేదు మొదట అనుకుని అనే ప్రశ్నకు డైరెక్టర్ మారినప్పుడు వాళ్లకు రాపో ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయించుకున్నారు అంతే ఇంక వేరే కారణాలు ఏమి లేవు. అయితే రామా నాయుడు గారు అందులో ఒక పాట అయినా నాతో పాడించేవారు అని చెప్పారు శ్రీలేఖ. ఇక తన అన్నదమ్ముల సహాయం, రెఫరెన్స్ ఎప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం తీసుకోలేదని, నా సొంతంగా నేను కెరీర్ లో వెళ్లానని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago