Actor Vish : మెహబూబ సినిమాలో విలన్ గా నటించిన విష్, నిజానికి విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ పేజెంట్ విన్నర్. ఇక సినిమాల మీద ఇంట్రస్ట్ తో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో నటించాడు. సినిమా తరువాత అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఇంకా ఇతర విభాగాలలో పనిచేసి ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇక లవ్ బ్రేక్ అప్ వల్ల మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లి, బ్యాంకాక్ వెళ్లి ఆరు నెలలు శిక్షణ తీసుకున్న విష్, ఇప్పుడు తాజాగా లైగర్ సినిమా అవకాశంతో విజయ్ దేవరకొండకి కి ధీటుగా నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధిచిన ఇంట్రెస్టింగ్ విషయాలను విష్ చెప్పారు.
లైగర్ మొదట అల్లు అర్జున్ కోసం రెడీ చేశారా…
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ కు పోటీగా విలన్ పాత్రలో విష్ నటించాడు, రెండు ఎద్దులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో మా ఫైట్ ఉండబోతోంది అంటూ ఆసక్తి పెంచాడు విష్. అయితే సినిమాలో నటించడమే కాకుండా సినిమా ప్రోడక్సషన్ భాద్యతలను కూడా విష్ చూసుకున్నాడు. పూరి కనెక్ట్స్ కి సీఈఓ గా ఉన్న విష్ సినిమా వ్యాపార బాధ్యతలను చూసుకున్నాడు.
ఇక సినిమాకు సంబంధిచిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు విష్. లైగర్ సినిమా మొదట బన్నీ తో చేయాలని పూరి అనుకున్నట్టు వార్తలు వినిపించగా ఈ విషయం పై విష్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిదేమి లేదని, పూరి తో ఒక ఇరవైకి పైగానే స్క్రిప్ట్లు రెడీ గా పెట్టుకుని ఉంటాడు. దాంట్లో ఏ హీరో ఎప్పుడు చేయడానికి దొరుకుతాడో ఆ హీరోతో ఒక స్క్రిప్ట్ చేస్తాడు. అంతే కానీ ఒకరి కోసం పూరి ఎదురుచూడడు అంటూ విష్ చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…