Featured

మా అధ్యక్షుడు నరేష్ చేసిందేమీ లేదు.. ఉన్న డబ్బులను ఖర్చు చేస్తున్నారంతే.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల హడావిడి జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితం మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు, హేమ, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు పోటాపోటీగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు నరేష్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ మా అధ్యక్షుడిగా ఉండి చేసిందేమీ లేదు..కేవలం ఎలక్షన్లు జరపకుండా అతనే అధ్యక్షుడిగా కొనసాగాలని చూస్తున్నారు అంటూ ఆమె నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం నరేష్ మా అధ్యక్ష పదవి పూర్తి అయ్యింది. ఈ క్రమంలోనే ఎలక్షన్లు జరిగి కొత్త అధ్యక్షుడుని నియమించాల్సి ఉంది. అయితే కరోనా కారణం వల్ల ఎలక్షన్లు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు అదుపులో ఉంటే సెప్టెంబర్ నెలలో మా ఎన్నికలు జరిగేలా చూడాలని మా సభ్యులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికి తరువాత ఎలక్షన్లు జరిగి కొత్త అధ్యక్షునికి బాధ్యతలు చేపట్టే వరకు పూర్తి అధికారాలు అతనికే ఉంటాయి కనుక ఎలక్షన్లు జరపకుండా అతనే అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ చూస్తున్నట్లు ఆరోపించారు. ఇతను అధ్యక్షుడిగా ఉండడం వల్ల అతను “మా” కోసం ఏమి కష్టపడలేదని, ఉన్న డబ్బులు కాస్తా ఖర్చు చేస్తున్నారు అంటూ అతని పై తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

మా అకౌంట్లో దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి అలాంటిది ప్రస్తుతం మూడు కోట్లు మాత్రమే ఉన్నాయని,ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే రేపు నటీనటులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడానికి కూడా మా అసోసియేషన్ దగ్గర డబ్బులు ఉండవని, వీలైనంత త్వరగా ఎలక్షన్లను జరిపి కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు ఇవ్వాలని హేమ ఆరోపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

10 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

11 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

12 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

13 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

13 hours ago