ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాలు.. ఎన్నో గొడవల నడుమ విజయవంతంగా ఎన్నికలు పూర్తయి.. అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు కూర్చున్నాడు. అతడి అధ్యక్షుడుగా ఎన్నికవ్వడం ఇష్టం లేని చాలామంది సినీ నటులు, నటీమణులు ఎన్నికలో గెలిచినా రాజీనామాలు సమర్పించారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సంబంధించి సభ్యులు అందరూ దాదాపు రాజీనామాలు సపర్పించారు. అప్పట్లో ప్రకాష్ రాజ్ ఎన్నికలు జరిగిన రోజుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత అతడు దాని గురించి మాట్లాడలేదు. తర్వాత చాలా రోజులకు మళ్లీ.. ‘మా’ లో వివాదాలు తెరలేస్తున్నాయి. ఎందుకంటే.. మా ఆఫీస్ కొన్ని రోజుల నుంచి మూతపడి ఉంది. కొత్త కార్యవర్గం అమల్లోకి వచ్చినా ఇంత వరకు ఆఫీస్ తాళాలుమాత్రం తీయలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు.
సినీ పరిశ్రమకు సంబంధించి నటులు సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ కు వెళ్తే.. అక్కడ మూసి వేసిన తలుపులు తప్ప ఏం కనిపించడం లేదని.. కార్యవర్గ సభ్యులు ఎవరూ ఆఫీస్ కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అయితే మా ఆఫీస్ కు అందరూ రావాల్సిన అవసరం ఉండదు.. కేవలం మీటింగ్ సమయలోనే అందరూ హాజరవుతారు.
మీటింగ్ లేని సందర్భంలో ఆ అవసరం ఉండదు. పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బందితో మాత్రమే కార్యాలయం పనిచేయాలి.. కానీ ప్రస్తుతం అక్కడ ఆ వాతావరణం కూడా కనిపించడం లేదంటూ ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మంచు విష్ణు నుంచి సమాధానం రాలేదు. అతడు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…