Movie News

Mahesh Babu: ఇలా మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అవుతుంది.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు తన నటనతో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

ఈ విధంగా హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం సినిమాలు విడుదలైన సమయంలో ఆ సినిమాలు కనుక తనకు నచ్చితే ఆ సినిమాల పైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మాత్రమే ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలుకి తెలుగులో భారీ స్పందన వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు తెలుగు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పట్ల మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

యాక్టింగ్ ఇరగదీశారు…
ప్రేమలు సినిమాను తెలుగు ఆడియన్స్‌కి చూపించినందుకు కార్తికేయకి పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా.. అసలు చివరిసారిగా ఓ సినిమా చూసి నవ్వుకొని చాలా రోజులైంది. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. ఈ చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ అంటూ మహేష్ బాబు చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago