Categories: FeaturedMovie News

Mahesh Babu : బాలీవుడ్ ఆఫర్లు ఉన్నాయి కానీ.. వాళ్లు నన్ను భరించలేరు.. : మహేష్ బాబు

Mahesh Babu intresting comments on bollywood : ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సర్కార్ వారి పాట సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరశురాం దర్శకత్వం వహించగా కీర్తిసురేష్ మొదటిసారి మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా మహేష్ బాబు తాజాగా మేజర్ చిత్రం నకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు గౌరవం ఇచ్చింది…..

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ వేడుకలో మహేష్ బాబు కాసేపు మీడియాతో ముచ్చటించారు. అప్పుడు ఆయనను కొందరు బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి ప్రశ్నలు అడుగగా… అందుకు మహేష్ చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.

బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన ఈవిదంగా సమాధానలు చెప్పారు. బాలీవుడ్ నుంచి నాకు ఆఫర్లు బాగానే వస్తున్నాయ్, కానీ వారు నన్ను భరిస్తారు అని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని చిత్ర పరిశ్రమలో పనిచేస్తే టైం వేస్ట్‌ చేసుకోవడం అవుతుంది. మనదగ్గర నాకు బాగానే ఆఫర్స్‌ వస్తున్నాయి. అంతేగాక తెలుగు చిత్ర పరిశ్రమల నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ ఇమేజ్ ఇచ్చింది. వీటి పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను వదిలేసి మరేదో ఇండస్ట్రీలో పని చేయాలనే ఆలోచన ప్రస్తుతం నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింతగా ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’ అంటూ మహేశ్‌ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago