Adavi Shesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి అందరికీ పరిచయమే. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్క సినిమాలో హీరోగా తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
2010లో కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అడవి శేష్.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు. ఇక 2018 లో విడుదలైన గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఈయన శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముంబై టెర్రర్ ఎటాక్ లో దేశం కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నేపథ్యంలో రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు జి ఎన్ వి ప్రొడక్షన్ లో నిర్మాతగా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆ ఈవెంట్లో అడవి శేష్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్ అని.. అమ్మ, నాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రెండ్ ఇలా మన అందరి లాగానే అతని జీవితం కూడా సింపుల్ గా ఉండేది.
అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక సాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారు అనేది ఈ సినిమాలో చూస్తారు అంటూ తెలిపాడు. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు బ్యాక్ బోన్ గా నిలిచాడు అని అన్నాడు. ఏం జరిగినా మహేష్ గారు ఉన్నాడని నమ్మకం ఉందని అన్నాడు. కోవిడ్ లాంటి కష్టకాలంలో మహేష్, నమ్రత తమని నిలబెట్టారు అని.. తమకు అండగా నిలబడ్డారు అని అన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…