Namitha: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి గుజరాతి బ్యూటీ నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటి. తన అందానికి కాస్త గ్లామర్ ను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా గ్లామర్ బ్యూటీ గా నిలిచి.. మిస్ ఇండియాగా నాల్గవ స్థానంలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సొంతం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు సినిమాలలో నటించగా.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
బిల్లా సినిమాలో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఏకంగా గ్లామర్ షో లతో, ఎద అందాలతో అందర్నీ నోటిమీద వేసేలా చేసింది. ఇక బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు సన్నగా, నాజూగ్గా ఉండే నమిత ఇప్పుడు బాగా బరువెక్కింది. దీంతో ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు రాలేక పోతున్నాయి.
ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీనే దూరం పెట్టింది. ఇక బరువు తగ్గించుకోడానికి తెగ ప్రయత్నించింది. 2017లో వీరేంద్ర చౌదరిని వివాహము చేసుకుంది నమిత. పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న నమిత తాజాగా గర్భవతి అయ్యిందని తెలిసింది. పైగా తను గర్భవతిగా ఉన్న ఫోటోను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకోగా.. మాతృత్వం.. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని.. మారాను అంటూ.. తనలోని మార్పు మొదలైందని అన్నది. తన ముఖంలో సరికొత్త చిరునవ్వు వచ్చిందని.. కొత్త జీవితం, కొత్త పిలుపులు.. మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.. ఎన్నో ప్రార్థనలు చేశా.. చివరకు నా కోరిక ఫలించిందని.. చిన్నారికి కిక్స్ కొత్త అనుభూతిని ఇస్తున్నాయని.. ఇంతకుముందు ఎప్పుడూ లేని సరికొత్త భావనను అనుభవిస్తాను అని పంచుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…